- విద్యాశాఖ సమీక్షలో కలెక్టర్ ప్రియాంక ఆల
హైదరాబాద్ సిటీ, వెలుగు: జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లలో స్టూడెంట్లకు బోధనలో టెక్నాలజీ, ఏఐ వినియోగాన్ని పెంచాలని హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక ఆల ఆదేశించారు. జిల్లాలో విద్యాశాఖ పనితీరుపై గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ స్కూళ్లలో కార్పొరేట్‌స్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నామని, అదే స్థాయిలో ఫలితాలు రావాలన్నారు. ఏడీ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
