నైట్ ఫ్రాంక్ ఇండియా రిపోర్ట్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లకు (జీపీయూలు), లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీలకు ప్రోత్సాహకాలు అందిస్తుండటంతో హైదరాబాద్ వేగంగా డేటా సెంటర్ హబ్‌గా మారుతోందని నైట్ ఫ్రాంక్ ఇండియా రిపోర్ట్తెలిపింది. దీని ప్రకారం, సిటీ డేటాసెంటర్ సామర్థ్యం 2022 లో 60.9 మెగావాట్లు ఉండగా 2025 చివరి నాటికి 151.4 మెగావాట్లకు పెరిగింది. రాబోయే కాలంలో 1.9 గిగావాట్ల ప్రాజెక్టులు రాబోతున్నాయి.
ముంబై తర్వాత దేశంలో ఇదే అతిపెద్దదిగా నిలిచింది. విపత్తులు లేని భౌగోళిక ప్రాంతం కావడం నగరానికి పెద్ద అనుకూలత. దీనివల్ల ఎన్టీటీ, అదానీ కనెక్స్ వంటి సంస్థలు తమ వ్యాపారాలను విస్తరిస్తున్నాయి. అమెజాన్ వెబ్ సర్వీసెస్‌కు ఇక్కడ మూడు జోన్లు ఉన్నాయి. ఇది 46 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది.
మైక్రోసాఫ్ట్ ఈ ఏడాదే నగరంలో తన కొత్త ప్రాంతీయ డేటా సెంటర్‌ను ప్రారంభించనుంది. ఒరాకిల్ కూడా విస్తరణ ప్రణాళికలు ప్రకటించింది. దేశం మొత్తం ఏడు ప్రధాన మార్కెట్ల లైవ్ ఐటీ డేటా సెంటర్ సామర్థ్యం 2025 చివరి నాటికి 1.6 గిగావాట్లు దాటింది.
