హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చర్లపల్లి ఫేస్ త్రీ ఇండస్ట్రీలో యస్ఇఆర్ ఎంటర్ ప్రైజర్ లో అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటను మంటలను ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని తెలిపారు కుషాయిగూడ పోలీసులు. ఫ్యాక్టరీలో మూడు కోట్ల విలువైన ఆస్తి నష్టం వాటిల్లిందని యజమాని తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై ఆరా తీస్తున్నారు.
