గచ్చిబౌలిలోని స్టార్ హోటల్లో డ్రగ్స్ పట్టివేత.. రాజకీయ నేత కుమారుడితోపాటు ఇద్దరు అరెస్ట్

గచ్చిబౌలిలోని స్టార్ హోటల్లో డ్రగ్స్ పట్టివేత.. రాజకీయ నేత కుమారుడితోపాటు ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్లో 2024 ఫిబ్రవరి 26 సోమవారం డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఒక రాజకీయ నేత కుమారుడితోపాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హోటల్లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు. 

నిన్న(ఫిబ్రవరి 25) అర్థరాత్రి స్టార్ హోటల్ లో ఓ విందు కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ తీసుకున్నట్లు తెలుస్తోందని వెల్లడించారు. మత్తు పదార్థాలైన కొకైన్ ను స్వీకరించినట్లు అనుమానిస్తున్నారు.  ప్రముఖ రాజకీయ నేత కుమారుడితో పాటు మరో ఇద్దరు స్నేహితులిద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.