ప్రభుత్వ హాస్పిటల్స్ లో.. కనిపించని కలర్ బెడ్ షీట్స్

ప్రభుత్వ హాస్పిటల్స్ లో.. కనిపించని కలర్ బెడ్ షీట్స్

ప్రభుత్వ దవాఖానల్లో కనిపించని రంగు దుప్పట్లు 

ఉస్మానియా, గాంధీలలో ప్రయోగాత్మకంగా ప్రారంభం

రెండేళ్ల కిందట అమల్లోకి తెచ్చిన కేంద్రం

మొదట్లో మూడు కలర్లు

ఇప్పుడు ప్రతి రోజూ తెలుపే

నిధులు లేకపోవడమే కారణం

హైదరాబాద్  వెలుగు: ప్రభుత్వ హాస్పి టల్స్ లో దుప్పట్లు ఎప్పటికప్పుడు మార్చేందుకు తెచ్చిన రంగు దుప్పట్ల విధానం మూణ్ణా ళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. పేషెంట్లకు ఎలాంటి ఇన్ ఫెక్షన్ సోకకుండా ఉండాలంటే వారంలో రోజుకో రంగు చొప్పున దుప్పట్లను మార్చాలన్న ఆలోచన చేశారు. కానీ ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు. రెండేళ్ల క్రితం కేంద్ర ఆరోగ్య శాఖ ఈ విధానాన్ ని అమల్లోకి తెచ్చింది. ముందుగా రాష్ట్రంలో పెద్దాస్పత్రులైనా ఉస్మానియా, గాంధీలలో ఏడు రంగుల దుప్పట్ల విధానాన్ని తెచ్చారు. ఐతే ప్రయోగాత్మకంగా ఊదా, గులాబీ, తెలుపు దుప్పట్లను అందించారు. మొదట్లో ఈ మూడు రంగుల దుప్పట్లను ఎప్పటికప్పుడు మార్చేవారు. దశల వారీగా ఏడు రంగుల దుప్పట్లను అందుబాటులోకి తేవాలని భావించారు. కానీ ప్రభుత్వం నిధుల విషయంలో అలసత్వం ప్రదర్శించడంతో ఏడు రంగుల దుప్పట్లు అందుబాటులోకి రాకముందే ఈ ప్రతిపాదన అటకెక్కింది. దీంతో ఎప్పటి మాదిరిగానే మళ్లీ తెల్ల దుప్పట్లనే వాడుతున్నారు.

 ఉస్మానియా, గాంధీ ఆస్పత్రిలోనూ అంతే

రాష్ట్రంలోని మిగతా హాస్పి టల్స్ తో పోల్చుకుం టే ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో రోజుకు వేల సంఖ్యలో రోగులు ఇక్కడ చికిత్స పొందుతారు. ఒక్క గాంధీ హాస్పి టల్ లోనే 1050 పడకలు ఉన్నప్పటికీ 1800 వందల మందిని ఇన్ పేషెంట్ గా చేర్చు కొని చికిత్స అందిస్తున్నారు. గైనకాలజీ, ఆర్థో పెడిక్, కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ లాంటి విభాగాల్లో నిత్యం వందలాది మందికి ఆపరేషన్లు నిర్వహిస్తారు. ఆ తర్వాత వారికి ఎలాంటి ఇన్ ఫెక్షన్ సోకకుండా ఉండాలంటే పరిసరాలు శుభ్రంగా ఉండటంతో పాటు ఏ రోజుకారోజు బెడ్లపైదుప్పట్లను మార్చాల్సి ఉంటుంది. ప్రస్తుతం తెల్ల దుప్పట్లను మాత్రమే అందిస్తుండటంతో వాటిని ఎన్ని రోజులకు ఒకసారి మార్చుతున్నారన్న విషయం తెలియడం లేదు. పేషెంట్లు మాత్రం మూడు రోజులకు ఒకసారి కూడా దుప్పట్లు మార్చడం లేదని విమర్శి స్తున్నారు.

దీంతో ఇన్ ఫెక్షన్లు సోకుతున్నాయంటున్నారు. ఐతే దుప్పట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటామని డాక్టర్లు చెప్తున్నారు. పేషెంట్లు లేని బెడ్లకు తప్ప మిగతా బెడ్లపై దుప్పట్లను రోజుకు మార్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అటు ఉస్మానియాలోనూ ఇదే పరిస్థి తి ఉంది. గాంధీతో పోల్చితే ఉస్మానియా ఆస్పత్రిలో వచ్చే పేషెంట్ల సంఖ్య ఎక్కువగా ఉంటోం ది. కానీ అందుకు తగిన విధంగా వసతులు ఉండటం లేదు. పాత భవనంలో రెండు ఫ్లో ర్ లను ఖాళీ చేసి గ్రౌండ్ఫ్లోర్ మొదటి అంతస్థులోనే పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు. దీంతో బెడ్ లు సరిపోక కిందనే బెడ్ లు వేసి మరీ వైద్యం చేస్తున్నారు.

ఎప్పుడు కిక్కిరిసి రోగులు ఉండటంతో దుప్పట్లు మార్చడం ఇబ్బందిగా మారుతోంది. రెండు, మూడు రోజులకొకసారి దుప్పట్లు మార్చుతున్నామని డాక్టర్లు అంటున్నారు.