V6 News

మండుతున్న ఎండలు.. జూ పార్క్ లో జంతువుల జలకాలాట

మండుతున్న ఎండలు.. జూ పార్క్ లో జంతువుల జలకాలాట

సిటీలో ఎండలు మండిపోతుండడంతో నెహ్రూ జూలాజికల్ పార్క్​లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్ప్రింక్లర్లు, ఫాగర్ల ద్వారా నీటిని చిమ్ముతూ ఎన్​క్లోజర్లను చల్లబరుస్తున్నారు. పులులు, సింహాలు వేడి నుంచి తప్పించుకోవడానికి నీటి కుంటల్లో ఈదుతూ సేదతీరుతుండగా, ఏనుగులు వాటర్ షవర్ల కింద నీటి జల్లులను ఆస్వాదిస్తున్నాయి. జింకల కోసం ప్రత్యేకంగా చలువ పందిళ్లు ఏర్పాటు చేయగా, నీల్గాయ్ వంటి వన్యప్రాణులు చెట్ల నీడను ఆశ్రయిస్తున్నాయి.  – హైదరాబాద్ సిటీ, వెలుగు

పీర్జాదిగూడలో 45.1 డిగ్రీలు

నగరంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మంగళవారం 45 డిగ్రీల మార్క్​ను దాటాయి.  పీర్జాదిగూడలో అత్యధికంగా 45.1 డిగ్రీలు నమోదు కాగా, అబ్దుల్లాపూర్​‌‌‌‌‌‌‌‌మెట్​లో  42.9 డిగ్రీలు, హిమాయత్​నగర్ ప్రాంతంలో 42.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది.  మిగతా చోట్ల దాదాపు 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు.