V6 News

తెలంగాణ చరిత్ర : హైదరాబాద్సిటీలో బేగం బిల్డింగ్.. ఎంత మందికి తెలుసు దీని విశిష్ఠత..!

తెలంగాణ చరిత్ర : హైదరాబాద్సిటీలో బేగం బిల్డింగ్.. ఎంత మందికి తెలుసు దీని విశిష్ఠత..!

హైదరాబాద్ నగరంలో వందేళ్లకు పైగా చారిత్రాత్మక నేపథ్యం ఉన్న భవనాలు, కట్టడాలు అప్పటి వైభవానికి ప్రతీకలు. వాటిల్లో విలాసవంతమైన, అందమైన రాజభవంతులుగా వెలుగొందినవి ఉన్నాయి.  వాటిలో మలక్ పేట్ ఏరియాలోని  బేగం  బిల్డింగ్​ ఒకటి. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. . !

 ఓల్డ్ మలక్​ పేట్  ప్రాంతంలో మహబూబ్ మాస్టన్ అనే పురాతన బేగం బిల్డింగ్​ ఉంది. అప్పట్లో  ఎనిమిది ఎకరాల జాగ దీని  సొంతం. అయితే, ఏడో నిజాం పాలన నుంచి ఈ మాన్షన్ బేగం బిల్డింగ్​  వైభవానికి చెక్ పడింది. దీని  చుట్టుపక్కల ఇళ్లు ఏర్పాటు కావడంతో  పట్టించుకునే వాళ్లు లేకపోయారు. ఉస్మాన్ గంజీ సుగంధ ద్రవ్యాల మార్కెట్ ను 1983లో ఈ  స్థలానికి తరిలించారు. కానీ, భవనాన్ని మాత్రం అలాగే వదిలేశారు.116 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ఈ భవనానికి నగరంలోనే అత్యంత అందమైన భవనంగా పేరుండేది.

నిజాం హస్తగతం

మలక్​ పేట్ ప్రాంతాన్ని తొలుత అభివృద్ధి చేసింది మాలిక్ యాకుత్, అబ్దుల్లా కుతుబ్​ షా దగ్గర మాలిక్ అధికారిగా పని చేసేవాడు. 19వ శతాబ్దం ప్రారంభంలో నగరంలో విలాసవంతమైన కట్టడాల నిర్మాణం షురూ అయ్యింది.. హస్సన్ బిన్ అబ్దుల్లా నవాబ్ జంగ్ అనే వ్యక్తి పాత మలక్ పేట్ ప్రాంతంలో మహబూబ్ మాన్షన్  అనే విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకున్నాడు. ఆరోజుల్లో నిజాం రాజులు సుందరమైన కట్టడాలను కొనుగోలు చేసేవాళ్లు. ఆ విధంగా ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ ఆ ప్యాలెస్​ ను హస్తగతం చేసుకున్నాడు. తర్వాత భవనానికి మార్పులు చేయించి ఎనిమిది ఎకరాలకు విస్తరించాడు. యూరోపియన్ మొగలాయి నిర్మాణ శైలితో తీర్చిదిద్దాడు.  ఈ భవనం సజ్రీ బాగ్​లోని కింగ్ కోరి ప్యాలెస్ ను పోలి ఉంటుంది

ముబారక్ మాన్షన్  భవనం  బేగమ్ కి కానుక

మీర్ మహబూబ్ నివాసం పురానాహవేలీలో ఉండేది. ఈయన  మహబూబ్ మాన్షన్​ ( ఆ భవనం) లోనే ఆయన ఎక్కువ సమయం గడిపేవాడు. ఈ భవనం కొనుగోలు వెనుక ఒక ప్రత్యేకమైన కారణం ఉందని చరిత్రకారులు చెబుతుంటారు. మీర్​భార్యల్లో సర్దార్ బేగం ఒకరు. ఆయనకు ఆమె అంటే చాలా ఇష్టం.  ఆయన భార్య  బేగానికి  గుర్రపు పందేలంటే ఇష్టమట.  మలక్​పేట రేసు కోర్సులను ఆమె చూసేందుకు ఈ భవనాన్ని కొనుగోలు చేసినట్టు చెబుతుంటారు. ప్రత్యేకమైన చాంబర్​ లో  బంగారు పరచాల మధ్య నుంచి ఆమె రేసులను చూసేది. బేగమ్​ను ప్రజలెవరూ చూడకుండా ఉంచేందుకే ఈ ఏర్పాటు చేశారట.  బంగారు వర్ణాలపై సూర్య కిరణాలు పడటం వల్ల చూడడం కష్టంగా ఉంటుందని.. కొన్నాళ్ల పాటు సర్దార్ బేగమ్​కి ఇది నివాసంగా ఉంది. ఆ తర్వాత నిజాం కుటుంబ సభ్యులు విశ్రాంతి భవనంగా ఉపయోగించుకునేవాళ్లు.

కళ కోల్పోయింది

నిజాం పాలకుల్లో అజఫ్ జారి ఎక్కువ సమయం ఇక్కడ గడిపేవాడు. అందుకే భద్రత కోసం ఇక్కడ కొంత సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. కొందరు అధికారులు చుట్టుపక్కల ప్రాంతంలో హవేలీ, భవనాలు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఈ ప్రాంతానికి పల్తాన్' అని పిలుచుకునేవాళ్లు ఏడో నిజాం కాలంలో అర్జీఎబల్జియా (నగర అభివృద్ధి పాలక సంస్థ )ఏర్పాటైంది. 

మలక్ పేట్ రైల్వే స్టేషన్ ఇరువైపులా వందల కొద్దీ ఇళ్లు -వెలిశాయి. కానీ, ఈ భవంతిని మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. ఒకప్పుడు కళాత్మక కట్టడంగా విరాజిల్లిన ఈ భవనం.. ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. కొందరు చెత్తా చెదారం పడేస్తున్నారు. పిల్లలు టాయిలెట్ కోసం వినియోగించుకుంటున్నారు. చుట్టుపక్కల కొందరు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. వందేళ్లు పైబడిన ఈ కట్టడం కూలిపోతుందేమోనన్న భయం స్థానికు ల్లో నెలకొంది. రిపేర్లు చేయించి విద్యా సంస్థగానో... లేదంటే మ్యూజియంగానో, మార్చాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు.


వెలుగు,లైఫ్​