వరల్డ్ టాప్ ఫుడ్ సిటీల లిస్ట్​లో హైదరాబాద్

వరల్డ్ టాప్ ఫుడ్ సిటీల  లిస్ట్​లో హైదరాబాద్

హైదరాబాద్ కు అరుదైన గుర్తింపు దక్కింది. వరల్డ్ టాప్ ఫుడ్ సిటీల లిస్ట్ లో సిటీ స్థానం సంపాదించుకుంది. ప్రపంచంలోనే బెస్ట్ ఫుడ్ సిటీల జాబితాను టేస్ట్ అట్లాస్ రూపొందించగా టాప్ 50లో హైదరాబాద్ చోటు దక్కించుకుంది. ఈ లిస్ట్ లో 39వ ర్యాంకును సొంతం చేసుకుంది.  టాప్ 50లో రెండు  ఇండియన్ సిటీలు మాత్రమే నిలిచాయి.

ఈ లిస్ట్ లో ముంబై 35వ స్థానంలో నిలిచింది. ఢిల్లీ 56వ ర్యాకు, చెన్నై 65వ ర్యాంకు, లక్నో 92వ ర్యాంకును దక్కించుకున్నాయి. రోమ్ , బోలోగ్నా, నేపుల్స్ సిటీలు టేస్ట్ అట్లాస్ జాబితాలో వరుసగా మూడు ర్యాంకులను సొంతం చేసుకున్నాయి. ఈ మూడు ఇటాలియన్ సిటీలే కావడం విశేషం. టాప్ 10 జాబితాలో .. వియన్నా (ఆస్ట్రియా), టోక్యో (జపాన్), ఒసాకా (జపాన్), హాంకాంగ్ (చైనా), టురిన్ (ఇటలీ), గాజియాంటెప్ (టర్కీ), బాండుంగ్ (ఇండోనేసియా) నిలిచాయి.