- లగ్జరీ కమర్షియల్ టవర్ నిర్మాణం
హైదరాబాద్, వెలుగు: రియల్ ఎస్టేట్ డెవలపర్ వంశీరామ్ బిల్డర్స్ హైదరాబాద్ రాయదుర్గంలో 5.09 ఎకరాల స్థలాన్ని రూ.1,040 కోట్లకు దక్కించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వేలంలో ఎకరాకు రూ.204 కోట్ల రికార్డు ధర పలికింది. కనీస ధర రూ.139 కోట్ల కంటే వంశీరామ్ 46.76 శాతం అదనంగా చెల్లించింది.
ఈ స్థలంలో 145 మీటర్ల ఎత్తు, 30 అంతస్తుల్లో'యూ' ఆకారంలో లగ్జరీ కమర్షియల్ టవర్‌ను నిర్మించనున్నారు. మొత్తం 20 లక్షల చదరపు అడుగుల్లో ప్రీమియం ఐటీ ఆఫీస్ స్పేస్, రిటైల్ జోన్లు, ఒక హోటల్ ఉంటాయి. నిర్మాణాన్ని నాలుగేళ్లలో పూర్తి చేస్తామని సీఎండీ సుబ్బారెడ్డి తెలిపారు. భారతదేశంలోని ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్లోనే రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి.
ఇక్కడ బహుళజాతి సంస్థలు (ఎంఎన్సీలు) తమ ఆఫీసులను విస్తరిస్తున్నాయి. సెకండరీ బిజినెస్ డిస్ట్రిక్ట్ (ఎస్బీడీ) కారిడార్‌లో భాగమైన రాయదుర్గంను చాలా కంపెనీలు ఎంచుకుంటున్నాయి.
