మెజీషియన్ వేణుకు పీఆర్ ఎక్సలెన్స్- అవార్డు

మెజీషియన్ వేణుకు పీఆర్ ఎక్సలెన్స్- అవార్డు

పద్మారావునగర్, వెలుగు: డెహ్రాడూన్‌లో జరిగిన 47వ జాతీయ ప్రజా సంబంధాల సదస్సులో హైదరాబాద్‌కు చెందిన అంతర్జాతీయ ఇంద్రజాలికుడు సామల వేణుకు 'పబ్లిక్ రిలేషన్స్ ఎక్సలెన్స్-2025' అవార్డు లభించింది.

 డెహ్రాడూన్​లో ఆదివారం హోటల్ ఎమరాల్డ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు నరేశ్​ భన్సాల్ ఈ అవార్డును అందజేశారు. మ్యాజిక్‌ను మాధ్యమంగా చేసుకుని ప్రజాసంబంధాలకు విశేష ప్రాచుర్యం కల్పిస్తున్నందుకు సామల వేణుకు ఈ గౌరవం దక్కిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సదస్సుకు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, సమాచార శాఖ మంత్రి గణేశ్​జోషి, జాతీయ పీఆర్ అధ్యక్షుడు అజిత్ పాటక్, రష్యన్ పీఆర్ కాంగ్రెస్ చైర్మన్ మైఖేల్ మాస్లోవ్‌తో పాటు దేశవ్యాప్తంగా 650 మంది పీఆర్ నిపుణులు పాల్గొన్నారు.