ఇడ్లీ అంటే అంతిష్టమా.. ఏడాదిలో రూ.7.3 లక్షల ఇడ్లీలు ఆర్డర్

ఇడ్లీ అంటే అంతిష్టమా.. ఏడాదిలో రూ.7.3 లక్షల ఇడ్లీలు ఆర్డర్

భారతీయుల్లో చాలామందికి ముఖ్యంగా దక్షిణ భారత ప్రజలకు ఇడ్లీ మంచి రుచికరమైన టిఫిన్(అల్పాహారం). ప్రతిరోజు మనం ఉదయం పూట తినే ఆహారంలో సుతిమెత్తగా త్వరగా జీర్ణం అయ్యే అల్పాహారం ఇడ్లీ. అలాంటి ఇడ్లీలను తినడంతో కూడా మన భారతీయులు రికార్డులు సృష్టిస్తున్నారు. ప్రతి సంవత్సరం మార్చి 30న జరుపుకునే వరల్డ్ ఇడ్లీ డే సందర్భంగా స్విగ్గీ ఓ రిపోర్టు ను వెల్లడించింది.ఓ వ్యక్తికి అత్యధికంగా ఇడ్డీలను  డెలివరీ చేసినట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా ఇడ్లీకి విపరీతమైన ప్రజాదరణ ఉందట. 

హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి ఇడ్లీలపై తనకు ఉన్న ప్రేమను చాటుకున్నాడు. ఏడాదిలో ఇడ్లీలకోసం 7.3లక్షల రూపాయలు ఖర్చు చేశాడు.  మార్చి 30,2023 నుంచి మార్చి 30,2024 వరకు ఏడాది కాలంగా 9వేల ఇడ్లీలను ఆర్డర్ చేశాడు. గత 12 నెలల్లో స్విగ్గీ లక్షలాది ప్లేట్ల ఇడ్లీలను డెలివరీ చేసిందట.అంటే దక్షిణ భారత రుచికరమైన వంటకం ఎంత ప్రజాదరణ పొందిందో తెలుస్తుంది. 

స్విగ్గి చెబుతున్న దాని ప్రకారం.. అత్యధికంగా ఇడ్లీలను ఆర్డర్ చేసిన మొదటి మూడు నగరాలుగా బెంగుళూరు, హైదరాబాద్, చెన్నైలలో నిలిచాయి. ముంబై, పుణే , కోయంబత్తూరు, ఢిల్లీ , వైజాగ్,కోల్ కతా , విజయవాడ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఇడ్లీలను ఎక్కువగా ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్య ఆర్డర్ చేస్తున్నారు.  బెంగుళూరు , హైదరాబాద్, చెన్నై, కోయంబత్తూర్, ముంబైలో కూడా వినియోగదారులు విందు సమయం కూడా ఇడ్లీ తింటారు. 

ఇడ్లీ కేవలం ఇష్టమైన అల్పాహారం మాత్రమే కాదు.. ఆరోగ్యకరమైనది కూడా. తరుచుగా పోషకాహారంలో కీలకమైన భాగంగా ఉంది.  స్విగ్గీద్వారా అత్యధికంగా ఆర్డర్ చేయబడిన అల్పాహారంగా ఇడ్లీ రెండో స్థానంలో ఉందట. మొదటిది మసాలా దోష. 
చాలామంది కస్టమర్లు తమ నమ్మకమైన ఇడ్లీలను సాంబారు, కొబ్బరి చక్నీ, కారం పొడి, మేడు వేద, సాగు, నెయ్యి, రెడ్ చట్నీ, జైన్ సాంబారుతో కలిపి ఆర్డర్ చేస్తున్నారట..