ఆగస్టు 2న నాంపల్లిలో మెగా జాబ్ మేళా

ఆగస్టు 2న నాంపల్లిలో మెగా జాబ్ మేళా

హైదరాబాద్: నిరుద్యోగులకు శుభవార్త.. ఆగస్టు 2న హైదరాబాద్ లోని నాంపల్లి రెడ్ రోజ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు నిర్వహించే ఈ జాబ్ మేళాలో నిర్వహిస్తారు. 

ఈ జాబ్ మేళాలో అనేక కంపెనీలు పాల్గొంటాయని నిర్వహహకులు తెలిపారు. ఫార్మా, ఆరోగ్యం, ఐటీ, ఐటీఈఎస్ సంస్థలు, విద్య, బ్యాంకులు,ఇతర రంగాలలో వివిధ హోదాల్లో ఉద్యోగాలను ఆఫర్ చేస్తాయని నిర్వాహకుడు మన్నన్ ఖాన్ ఇంజనీర్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని కూడా కల్పిస్తాయని చెప్పారు. 

►ALSO READ | వైజాగ్ లో పార్ట్నర్ షిప్ సమ్మిట్... ఆరుగురు మంత్రుల బృందంతో కమిటీ..

అభ్యర్థుల కనీస అర్హత SSC ఉండాలి.ప్రాథమిక ఇంటర్వ్యూలు వేదిక దగ్గర నిర్వహిస్తారు. ఈ జాబ్ మేళాలో పాల్గొనేందుకు ఎటువంటి ఫీజు లేదు. ఆసక్తిగల ఉద్యోగార్థులు మరిన్ని వివరాల కోసం 8374315052 నంబర్‌ను సంప్రదించవచ్చు.