
ఏపీలో పెట్టుబడులు, పరిశ్రమలే లక్ష్యంగా కూటమి సర్కార్ వేగంగా అడుగులేస్తోంది. ఈ క్రమంలో పార్ట్నర్ షిప్ సమ్మిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. నవంబర్ 14, 15 తేదీల్లో వైజాగ్ లో నిర్వహించనున్న కార్యక్రమం కోసం పలు కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఇందుకు గాను మొత్తం ఆరుగురు మంత్రుల బృందంతో కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
ఈ బృందానికి మంత్రి నారా లోకేష్ ను చైర్మెన్ గా నియమించింది ప్రభుత్వం.ఈ కమిటీలో సభ్యులుగా మంత్రులు నారాయణ, కందుల దుర్గేష్, టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, గొట్టిపాటి రవికుమార్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.ఇదిలా ఉండగా సమ్మిట్ లో వసతులు, ఏర్పాట్లకు సంబంధించి మరో 9 వర్కింగ్ కమిటీలను కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
ఈ 9 వర్కింగ్ కమిటీల్లో ప్రోటోకాల్ కమిటి చైర్మన్ గా సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, మరో 8 మందితో కమిటి... లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ ఛైర్మన్ గా ట్రాఫిక్ కమిటీ, విశాఖ నగర సుందరీకరణ కమిటీ ఛైర్మన్ గా మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో 10 మంది సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
టూరిజం శాఖ ముఖ్యకార్యదర్శి ఛైర్మన్ గా కల్చర్ కమిటీ, సమాచార శాఖ డైరెక్టర్ ఛైర్మన్ గా మీడియా, పబ్లిసిటీ కమిటీ, మైనింగ్ శాఖ కార్యదర్శి చైర్మన్ గా ఎగ్జిబిషన్ కమిటీ, పెట్టుబడులు ప్రమోషన్ కమిటీకి చైర్మన్ గా ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో పలు శాఖ అధికారులతో కమిటీ, బిజినెస్ కమిటీకి ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి ఛైర్మన్ గా పలువురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.