రాష్టానికి భారీ వర్ష సూచన

రాష్టానికి భారీ వర్ష సూచన

హైదరాబాద్: రేపు ఎల్లుండి రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర ఒరిస్సా దానిని అనుకుని ఉన్న దక్షిణ జార్ఖాండ్ అండ్ గాంగ్ టిక్ వెస్ట్ బెంగాల్ ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం ఈ రోజు మధ్య ప్రదేశ్ మధ్య భాగం పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఈ రోజు ఉపరితల ఆవర్తనం వాయువ్య బంగాళా ఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడి...సగటు సముద్ర మట్టo నుండి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొద్ది నైరుతి దిశకు వంపు తిరిగి ఉంది.  అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

సిటీలో మొదలైన వర్షం

సిటీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిస్తున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఖైరతాబాద్, లకిడికపూల్, బేగంపేట్, సికింద్రాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అవుతోంది.