రాష్ట్రంలో మూడ్రోజులు తేలికపాటి వర్షాలు

రాష్ట్రంలో మూడ్రోజులు తేలికపాటి వర్షాలు

హైదరాబాద్: రాబోయే మూడ్రోజులు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని పేర్కొన్న హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి తదుపరి 48 గంటల్లో బలపడుతుందని పేర్కొంది. అందుకే గాలులు ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్నాయని వివరించింది. సోమవారం రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే వరదలతో అతలాకుతలమైన నెల్లూరు, చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా కడప, చిత్తూరు జిల్లాల్లో విద్యా సంస్థలకు జగన్ సర్కారు సెలవు ప్రకటించింది.