

ఈ విషయంపై సోషల్ మీడియాలో స్పందిన పోలీసులు.. “ ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మెట్రో రైల్వే స్టేషన్ లిఫ్ట్ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. వృద్దులు నడవలేని వారు స్టేషన్ పై ఎక్కేందుకు అధికారులు లిఫ్ట్ ఏర్పాటు చేస్తే, అదికాస్త లవర్లకు ఎంకాంత సేవకు అనువుగా మారిపోయింది.
జనం లేని స్టేషన్ లకు వచ్చి లవర్స్ లిఫ్ట్ లలో చేసే పనులు చూసి అధికారులు ఖంగు తిన్నారు. సిసి ఫుటేజ్ చూసి బిత్తర పోయారు. వెంటనే ఫుటేజ్ ని పోలీసులకు అందించారు. అయితే అందులో సిసి కెమెరాలు ఉన్నాయన్న సంగతి తెలియని ప్రేమికులు చేసే వీడియోస్ చూసి అధికారులు సిగ్గుపడే పరిస్థితి ఏర్పడింది” అని తెలిపారు. యువత చదువుపై శ్రద్ద పెట్టాలితప్ప..ఇలాంటి పాడు పనులతో భవిష్యత్తు పాడు చేసుకోవద్దని సూచించారు పోలీసులు. తల్లిదండ్రులు కూడా పిల్లలపై ఓ కంట కనిపెట్టాలన్నారు. దీనిపై తక్షణమే మెట్రో అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.