దేశంలో టాప్-10 సేఫెస్ట్ సిటీల్లో కనిపించని హైదరాబాద్ పేరు.. మెుదటి స్థానంలో ఎవరంటే..?

దేశంలో టాప్-10 సేఫెస్ట్ సిటీల్లో కనిపించని హైదరాబాద్ పేరు.. మెుదటి స్థానంలో ఎవరంటే..?

ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నగరాలు, దేశాలు సేఫ్టీ విషయంలో ఏ ర్యాంకుల్లో ఉన్నాయనే విషయాన్ని నంబో సేఫ్టీ ఇండెక్స్ నివేదిస్తుంటుంది. ఈ క్రమంలో 2025లో ప్రపంచంలో 67వ సేఫెస్ట్ దేశంగా ఇండియా చోటు దక్కించుకుంది. ఈ క్రమంలో ఇండెక్స్ స్కోర్ 55.8గా నమోదైంది. ఈ క్రమంలో ప్రపంచంలోనే సేఫెస్ట్ సిటీల లిస్టులో మెుదటి స్థానంలో అబుదాబీ నిలిచింది. దీని తర్వాత దోహా, దుబాయ్, షార్జా, తైపీ, మనామా, మస్కట్, హేగ్, ట్రోండ్‌హీమ్, ఐండ్‌హోవెన్ నగరాలు టాప్ 10 లిస్టులో చోటు దక్కించుకున్నాయి. 

ఇక ఇండియా విషయానికి వస్తే దేశీయంగా టాప్-10 సేఫెస్ట్ నగరాల జాబితాలో హైదరాబాద్ పేరు కనిపించకపోవటం గమనార్హం. దేశీయంగా సేఫ్టీ ర్యాకింగ్స్ లో మెుదటి స్థానంలో కర్ణాటకలోని మంగళూరు సిటీ చోటు దక్కించుకుంది. గుజరాత్‌లోని వడోదర రెండో స్థానంలో, అహ్మదాబాద్ మూడో స్థానంలో,  సూరత్ నాల్గో స్థానంలో నిలిచాయి. ఇక జైపూరు నగరంలో ఐదవ స్థానంలో కొనసాగుతోంది. 

ఇక సేఫ్టీ సిజీల జాబితాలో దేశ ఆర్థిక రాజధాని నగరం నవీ ముంబై 6వ స్థానానికి పరిమితం అయ్యింది. దీని తర్వాత కేరళలోని తిరువనంతపురం 7వ స్థానంలో, తమిళనాడులోని చెన్నై 8వ స్థానంలో, మహారాష్ట్రలోని పూణే 9వ స్థానంలో ఉండగా.. 10వ స్థానంలో చండీగఢ్ నిలిచింది. అయితే ఈ ర్యాంకింగ్స్ ఆయా నగరాల్లో ఉన్న భద్రత, క్రైమ్ రేట్ ఆధారంగా ఇవ్వబడ్డాయి. ప్రజలు ఈ నగరాల్లో రోజూ ప్రయాణాలు పగలు, రాత్రి వేళల్లో ఎంత సురక్షితంగా భావిస్తున్నారు అనే అంశంతో పాటు నగరాల్లోని నేరాలు, కార్ల దొంగతనాలు, కొత్తవారి దాడులు, వేధింపులు, వర్ణవర్గ వివక్ష , మతపరమైన వివక్ష వంటి అంశాల ఆధారంగా ర్యాంకింగ్స్ ఇచ్చారు.