హైదరాబాద్: మే 28న పాస్‌పోర్ట్ సేవలు బంద్ ఉంటాయని హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం ప్రకటించింది. బక్రీద్ సెలవు మారడంతో.. మే 28న పాస్‌పోర్ట్ కార్యాలయాలు, PSKలు, POPSKలు పనిచేయవని స్పష్టం చేసింది. మే 28కి ఉన్న అపాయింట్‌మెంట్‌లు మే 27వ తేదీకి ఇప్పటికే రీషెడ్యూల్ కావడం గమనార్హం. మే 27న సేవలు యథావిధిగా కొనసాగుతాయని డిప్యూటీ పాస్‌పోర్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావు వెల్లడించారు.
సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జర్నలిస్టుల కోసం ప్రత్యేక పాస్ పోర్టు మేళా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పాస్‌పోర్టు మొబైల్ వెహికల్ ద్వారా ఈ పాస్‌పోర్టు సేవలను అందిస్తున్నారు. అన్ని డాక్యుమెంట్లు పూర్తి చేసిన వారికి సకాలంలో పాస్ పోర్టు జారీ చేస్తారు.
మొదటిసారి మొబైల్ పాస్ పోర్టు సేవా కేంద్రాన్ని హైదరాబాద్ ప్రెస్ క్లబ్లోనే ప్రారంభించడం గమనార్హం. రోజుకు 40 మంది చొప్పున 600 మందికి పాస్ పోర్టులను జారీ చేస్తున్నారు. ఈ అవకాశాన్ని జర్నలిస్టు కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని పాస్‌పోర్ట్ కార్యాలయం సూచించింది.
