హైదరాబాద్ లో 59 మంది సైబర్ నేరగాళ్లు అరెస్ట్.. రూ. 86 లక్షలు బాధితులకు తిరిగి చెల్లింపు

హైదరాబాద్ లో 59 మంది సైబర్ నేరగాళ్లు అరెస్ట్.. రూ. 86 లక్షలు బాధితులకు తిరిగి చెల్లింపు

హైదరాబాద్​సిటీ, వెలుగు: హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సెప్టెంబర్ 2025లో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లలో దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల నుంచి 59 మంది నిందితులను అరెస్టు చేసి, సైబర్ నేరాల బాధితులకు రూ. 86,64,827- తిరిగి చెల్లించారు. సెప్టెంబర్ నెలలో 320  ఎన్​సీఆర్‌‌‌‌పీ ఫిర్యాదులు అందగా, హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌‌‌‌లో 222 ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌లు , జోనల్ సైబర్ సెల్స్‌‌‌‌లో 106 ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌లు నమోదయ్యాయి. 

ఈ ఆపరేషన్లలో ఇన్వెస్ట్​మెంట్​ఫ్రాడ్​లు, మోసాలు 28 , డిజిటల్ అరెస్టు 6, పార్ట్-టైమ్ పెట్టుబడి మోసాలు 4, వివాహ మోసాలు 2, క్రెడిట్ కార్డ్ మోసాలు 4, సినిమా పైరసీ 3, ఉద్యోగ మోసం 1, ట్రేడింగ్ మోసం 1, సోషల్ మీడియా సంబంధిత నేరాలు 4, అనధికార లావాదేవీలు 3 వంటి నేరాలకు సంబంధించి 59 మందిని అరెస్టు చేశారు. నిందితుల్లో 74 మంది తెలంగాణ, 53 మంది మహారాష్ట్ర , 30 మంది కర్నాటక, 15 మంది గుజరాత్, 12 మంది ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నారు. 

వీరపై దేశవ్యాప్తంగా 257 కేసులు, తెలంగాణలో 74 కేసులలో ఉన్నాయి. వీరి నుంచి  43 మొబైల్ ఫోన్లు, 9 చెక్ బుక్‌‌‌‌లు, 8 బ్యాంక్ పాస్​బుక్‌‌‌‌లు, 23 ఏటీఎం కార్డులు, 4 ల్యాప్​టాప్‌‌‌‌లు, 1 షెల్ కంపెనీ స్టాంప్, 21 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి- ఇన్వెస్ట్​మోసాల నుంచి  రూ. 58,47,595, - ఓటీపీ మోసం: రూ. 5,21,150 , - డిజిటల్ అరెస్టు: రూ. 3,34,065, - ట్రేడింగ్ మోసం: రూ. 12,43,111  ను రీఫండ్​ చేశారు.