బషీర్బాగ్, వెలుగు: సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. నగరానికి చెందిన ఓ బాధితుడు ఆన్లైన్ ట్రేడింగ్ లో రూ.49.90 లక్షలు మోసపోయానని గతంలో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో ఎ–2గా ఉన్న నగరానికి చెందిన మహ్మద్ అష్ఫేక్ కిరాణా షాపు నడుపుతున్నాడు. ఇతను కమీషన్ బేసిస్పై తన బ్యాంక్ అకౌంట్లను ఢిల్లీలో ఉన్న స్కామర్స్ కు ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
బాధితుడు బదిలీ చేసిన డబ్బులను స్కామర్స్ కు పంపించాడు. దేశవ్యాప్తంగా 29 కేసుల్లో, తెలంగాణలో 12 కేసుల్లో అష్ఫేక్ఇన్వాల్వ్మెంట్ఉన్నట్లు తేలింది. ఇతనిఅకౌంట్ల ద్వారా ఇప్పటివరకు రూ.3.70 కోట్ల వరకు లావాదేవీలు జరిగాయి. నిందితుడిని మంగళవారం రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
