చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ముదిమ్యాల్, మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామాల్లోని 39 ఫామ్‌హౌస్‌లపై ఆదివారం రాజేంద్రనగర్ జోన్ డిప్యూటీ కమిషనర్ శ్యామ్గౌతమ్ పర్యవేక్షణలో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. దాదాపు 29 మందికి అనుమానిత వ్యక్తులపై డ్రగ్ టెస్ట్ నిర్వహించగా ఎవరికీ పాజిటివ్ రాలేదని పోలీస్ లు తెలిపారు.
దాదాపు 120 ఫోర్-వీలర్లు, 30 త్రీ-వీలర్లు, 15 టూ-వీలర్లు పరిశీలించారు. 3 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసి వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ముదిమ్యాల్లో రితికా ఫామ్‌హౌస్‌లో 150 మంది స్కూల్ పిల్లలతో సౌండ్ సిస్టమ్ పెట్టి అనధికారిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గుర్తించి, జరిమానా విధించారు.
