హైదరాబాద్లో భారీగా నకిలీ మద్యం.. మీరు తాగే మద్యం అసలుదా..? కల్తీదా

హైదరాబాద్లో భారీగా నకిలీ మద్యం.. మీరు తాగే మద్యం అసలుదా..?  కల్తీదా

మీరు తాగే మద్యం కల్తీదా..? నిజమైనదా..? ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నామంటే..హైదరాబాద్ లో భారీ స్థాయిలో నకిలీ మద్యం పట్టుబడింది. ఖరీదైన బాటిళ్లు, విదేశీ కంపెనీలకు చెందిన లిక్కర్ సీసాల్లో..తక్కువ ధర మద్యం కలిపి అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. మద్యాన్ని కల్తీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. 

హైదరాబాద్ శేరిలింగంపల్లిలో ఎక్సైజ్ శాఖ పోలీసులు భారీగతా నకిలీ మద్యాన్ని సీజ్ చేశారు.  ఖరీదైన స్కాచ్ బాటిళ్లలో తక్కువ ధర మద్యం కలిపి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న ఘరానా దొంగలను అరెస్టు చేశారు.  52 ఫుల్ బాటిళ్లు, పలు విదేశీ కంపెనీలకు చెందిన మరో 55  నకిలీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

నిందితులు సంజయ్ సాహు, మలయ పాత్రో, సంగ్రామ్ బరల్ అనే ముగ్గురు హైదరాబాద్లోని పలు పబ్ లు, ప్రైవేటు ఈవెంట్లలో పనిచేసే బార్ సిబ్బంది నుంచి ఖాళీ మద్యం బాటిళ్లను సేకరిస్తున్నారు. ఈ బాటిళ్లలో తక్కువ ధర మద్యాన్ని నింపి అమ్ముకుంటున్నారు. 

ALSO READ : దసరా పండుగ గురించి పురాణాల్లో ఏముందో తెలుసా....