చేవెళ్ల, వెలుగు: న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వాడినా, సౌండ్ వాయిలెన్స్‌కు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని రాజేంద్రనగర్ జోన్ డీసీపీ యోగేశ్ గౌతమ్ హెచ్చరించారు. గురువారం మొయినాబాద్ లో చేవెళ్ల, మొయినాబాద్ పీఎస్‌ల పరిధిలోని ఫామ్ హౌస్‌ల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈవెంట్ నిర్వహించే ఫామ్ హౌస్‌లలో ఎలాంటి మత్తు పదార్థాలు వాడొద్దని, ఈవెంట్లకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని చెప్పారు. లిక్కర్‌కు ఎక్సైజ్డిపార్ట్మెంట్పర్మిషన్ ఉండాలన్నారు.
డీజేల వినియోగంపై ఆంక్షలున్నాయని, చుట్టుపక్కల ప్రజలు ఫిర్యాదు చేస్తే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆశ్లీల డ్యాన్సులు, బెట్టింగ్ నిషేదమని, పటాకులు కాల్చడానికి కూడా అనుమతి లేదన్నారు. ఈవెంట్ ఏరియాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. చేవెళ్ల డివిజన్ఏసీపీ కిషన్, మొయినాబాద్ సీఐ పవన్ కుమార్‌రెడ్డి, ఎస్సైలు పాల్గొన్నారు.
