పంజాగుట్ట, వెలుగు: బేగంపేటలోని హైదరాబాద్పబ్లిక్ స్కూల్ గ్రాడ్యుయేషన్ డే సోమవారం ఘణంగా జరిగింది. నటుడు పుల్కిత్ సామ్రాట్చీఫ్గెస్ట్గా హాజరై, 150 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు తమ జీవితాల్లో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టాలని సూచించారు.
పాఠశాల ప్రిన్సిపాల్స్కంద్ బాలి మాట్లాడుతూ.. తమ పాఠశాలలో చదివిన విద్యార్థులు వివిధ రాష్ట్రాల ప్రభుత్వ కీలక శాఖల్లో, రాజకీయాల్లో ఉన్నత పదవులు చేపట్టారని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
