హైదరాబాద్లో నాన్ స్టాప్ వర్షం..మరో రెండు రోజులు అలర్ట్

హైదరాబాద్లో నాన్ స్టాప్ వర్షం..మరో రెండు రోజులు అలర్ట్

హైదరాబాద్ లో వర్షం నాన్ స్టాప్ గా  కురుస్తూనే ఉంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట,అమీర్ పేట, కూకట్ పల్లి, కొండాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మణికొండ, ఖైరతాబాద్, చార్మినార్, దిల్ సుఖ్ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్,బోయిన్ పల్లి, చింతల్,  సుచిత్ర, జీడిమెట్ల, బాలానగర్, ఐపీపీల్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. వర్షం కారణంగా నగరంలో భారీగా ట్రాఫిక్ జాం అవుతోంది. అత్యవసరమైతేనే బయటకు రావాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

మరోవైపు ఈ రోజు కూడా హైదరాబాద్ తో పాటు, చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాత్రి నుంచి కురుస్తోన్న వర్షాలకు  లోతట్టు కాలనీల్లోకి వరద చేరింది. ఇప్పటికే కొన్ని కాలనీలు వరదలోనే ఉన్నాయి. భారీ వర్షాలతో రోడ్లన్నీ దెబ్బతినడంతో..భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. సిటీ శివారు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

భారీ వర్షాలతో హైదరాబాద్ పురానాపూల్ దగ్గర మూసీ నది ఉప్పొంగుతోంది. దీంతో మూసీ ఒడ్డున  ఉన్న చిన్న ఆలయాలు వరదలో మునిగిపోయాయి. దోబీ ఘాట్ ను బంద్ చేశారు అధికారులు. 
మరోవైపు జంట జలాశయాలకు వరద కొనసాగుతోంది. ఉస్మాన్ సాగర్ , హిమాయత్ సాగర్ రెండు గేట్లు ఎత్తి దిగువకునీటిని వదులుతున్నారు అధికారులు. ఇప్పటికే సిటీకి అతి భారీ వర్షాల అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. అత్యవసరం అయితేనే బయటకు రావాలంటూ అధికారులు సూచించారు. రోడ్లపై వరద ఆగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలిచ్చారు.