హైదరాబాద్ కంటే.. రంగారెడ్డి జిల్లానే రిచ్..

హైదరాబాద్ కంటే.. రంగారెడ్డి జిల్లానే రిచ్..

తెలంగాణ  రాష్ట్ర తలసరి ఆదాయం విషయంలో  రంగారెడ్డి జిల్లా టాప్ లో నిలువగా, హైదరాబాద్  రెండో స్థానంలో నిలిచింది. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ప్రకారం  రూ.8,15,996లతో రంగారెడ్డి  మొదటి స్థానంలో ఉండగా, రూ 4,03,214 లతో హైదరాబాద్ జిల్లా రెండో స్థానంలో ఉంది. ఇక రూ. 3,08,166లతో సంగారెడ్డి మూడోస్థానంలో నిలిచింది.   తలసరి ఆదాయం ఆధారంగా తెలంగాణలోని టాప్ పది జిల్లాలను చూద్దాం.  

  • రంగారెడ్డి    8,15,996
  • హైదరాబాద్    4,03,214
  • సంగారెడ్డి    3,08,166
  • మేడ్చల్-మల్కాజిగిరి  2,58,040
  • యాదాద్రి భువనగిరి    2,47,184
  • నల్గొండ                            2,42,103
  • మెదక్                                2,32,384
  • భద్రాద్రి కొత్తగూడెం  2,28,582
  • జయశంకర్ భూపాలపల్లి  2,23,481 

GDDP,  తలసరి ఆదాయం రెండింటిలోనూ, తెలంగాణలోని ధనిక జిల్లాల జాబితాలో హైదరాబాద్ రెండవ స్థానంలో ఉంది.

2022-23 ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి రూ.13 లక్షల 13 వేల 391 కోట్ల జీఎస్డీపీ వృద్ధి రేటు 16.3శాతం కాగా జాతీయ వృద్ధి 16.1శాతంగా ఉంది. జిల్లాల వారిగా చూస్తే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రంగారెడ్డి అగ్రభాగాన ఉంది. రంగారెడ్డి స్థూల ఉత్పత్తి రూ. 2 లక్షల 41 వేల 843 కోట్లు కాగా  రూ.లక్ష 86 వేల158 కోట్లతో హైదరాబాద్ రెండో స్థానంలో 76 వేల 415 కోట్లతో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మూడో స్థానంలో ఉన్నాయి.

 

  • రంగారెడ్డి    2,41,843
  • హైదరాబాద్    1,86,158
  • మేడ్చల్-మల్కాజిగిరి  76,415
  • సంగారెడ్డి    56,464
  • నల్గొండ                 46,286
  • ఖమ్మం                 36,598
  • నిజామాబాద్  32,310
  • భద్రాద్రి కొత్తగూడెం  29,411
  • మహబూబ్ నగర్ 26,307
  • సూర్యపేట         26,260

తలసరి ఆదాయం ఆధారంగా టాప్ 10 ధనిక రాష్ట్రాల జాబితాలో సిక్కిం టాప్ లో  ఉండగా,  గోవా రెండోస్థానంలో,  తెలంగాణ మూడవ స్థానంలో ఉంది.