
తెలంగాణలో పోలింగ్ కొనసాగుతోంది. చాలా చోట్ల పోలింగ్ మందకొండిగా జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంటల వరకు కేవలం 36.68 శాతం మాత్రమే పోలింగ్ నమోదయ్యింది. రూరల్ ఏరియాలో పోలింగ్ ఎక్కువగా నమోదు కాగా.. పట్టణ ప్రాంతాల్లో తక్కువగా నమోదవుతోంది. పోలింగ్ రోజున హాలిడే ఇచ్చినా ఓటర్లు ఆసక్తి చూపడం లేదు. అటు పోలింగ్ కేంద్రాలు కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. తమ ఓటు హక్కు వినియోగించుకోకుండా.. ఇంట్లోనే ఉంటున్నారు ఓటర్లు. దీంతో హైదరాబాద్ లో రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి.
అత్యధికంగా మెదక్ లో 51 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. భూపాలపల్లి జిల్లాలో 49 శాతం, గద్వాలలో 49.29 మహబూబ్ నగర్ లో 46.89 శాతం నమోదు కాగా.. అతి తక్కువగా హైదరాబాద్ లో 21 శాతం మాత్రమే పోలింగ్ నమోదయ్యింది. పోలింగ్ పర్సంటేజ్ పెంచడంపై ఈసీ ఫోకస్ పెట్టిన ప్రయోజనం లేదు. హైదరాబాద్ తో పాటు మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాల్లోనూ పోలింగ్ తక్కువగా నమోదయ్యింది. రంగారెడ్డిలో 29.79 శాతం, మల్కాజ్ గిరిలో 26.70 శాతం పోలింగ్ నమోదయ్యింది.
రాష్ట్రవ్యాప్తంగా 35 వేల 655 పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేస్తున్నారు ప్రజలు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు.