- ఐదుగురికి జైలుశిక్ష
హైదరాబాద్‌సిటీ, వెలుగు: గణేశ్ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ కమిషనరేట్పరిధిలో ఈవ్‌టీజింగ్ తో పాటు మహిళలను వేధిస్తున్న 3 వేల మందిని షీ టీమ్స్ పట్టుకున్నాయి. కేవలం ఖైరతాబాద్ బడా గణేశ్, బాలాపూర్ గణేశ్మండపాల వద్దే 2,935 మందిని అదుపులోకి తీసుకున్నారు.
వీరిలో 858 మందిని కౌన్సెలింగ్ తో పాటు వార్నింగ్ఇచ్చి వదిలిపెట్టగా, 24 మందికి రూ.1,050 జరిమానా విధించారు. 40 మందికి సామాజిక సేవ చేయడంతోపాటు రూ.1,050 ఫైన్వేశారు. ఐదుగురికి మాత్రం జరిమానాతోపాటు జైలుశిక్ష వేశారు.
