పదేండ్ల బీఆర్ఎస్ పాలన కంటే..మా ప్రభుత్వంలోనే ఎక్కువ ఇండ్లు: మంత్రి పొంగులేటి

పదేండ్ల బీఆర్ఎస్ పాలన కంటే..మా ప్రభుత్వంలోనే ఎక్కువ ఇండ్లు: మంత్రి పొంగులేటి
  • ఏడాదిలోగా ఇందిరమ్మ టవర్లలో గృహప్రవేశాలు
  • హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడి

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్​పదేండ్ల పాలన కంటే.. తమ ఐదేండ్ల ప్రజా ప్రభుత్వ పాలనలోనే ఎక్కువ ఇండ్లు నిర్మిస్తున్నామని హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పేదల సొంతింటి కలను ఎన్నికల హామీగా కాకుండా, ప్రభుత్వ బాధ్యతగా భావించి అమలు చేస్తున్నామని తెలిపారు. మంగళవారం నాంప‌‌‌‌‌‌‌‌ల్లి నియోజ‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌ర్గంలోని రెడ్ హిల్స్ లో ఇందిర‌‌‌‌‌‌‌‌మ్మ ట‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌ర్స్ నిర్మాణానికి స‌‌‌‌‌‌‌‌హ‌‌‌‌‌‌‌‌చ‌‌‌‌‌‌‌‌ర మంత్రి అజారుద్దీన్‌‌‌‌‌‌‌‌, ఎంపీ అనిల్ కుమార్ యాద‌‌‌‌‌‌‌‌వ్‌‌‌‌‌‌‌‌, ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్‌‌‌‌‌‌‌‌తో క‌‌‌‌‌‌‌‌లిసి మంత్రి శంకుస్థాప‌‌‌‌‌‌‌‌న చేశారు. 

ఈ ప్రాంతంలో 5 ఎకరాల్లో 480 ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. లాటరీ ద్వారా ఫ్లోర్లు, టవర్లలో లబ్ధిదారుల ప్లాట్ నంబర్​ను తీసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సంద‌‌‌‌‌‌‌‌ర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ఇందిరమ్మ టవర్ల నిర్మాణం ఒక దశకే పరిమితం కాదని.. 2,3,4 దశల్లో సైతం నిర్మిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికలలోపు 4 విడతల్లో ఇండ్ల నిర్మాణాన్ని పూర్తిచేసి లబ్ధిదారులకు తాళాలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. క్యూఆర్/కోర్ ప్రాంతంలో ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల భూములను గుర్తించి, వాటిని హౌసింగ్ శాఖకు బదలాయించి పేదల కోసం గ్రౌండ్ ప్లస్ పది ఫ్లోర్లలో అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లు నిర్మించాలని నిర్ణయించినట్టు తెలిపారు. 

క్యూర్ ప్రాంతంలో త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. ప్రస్తుతం నిర్మిస్తున్న ఒక్కో అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ విలువ సుమారు రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంటుందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఏడాదిలోపే నిర్మాణాలు పూర్తి చేసి, ఇదే వేదిక నుంచి లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా టవర్స్‌‌‌‌‌‌‌‌లో నివసించే కుటుంబాలకు డ్రైనేజీ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ కోరారు. 

దీంతో ఆ సమస్యను హౌసింగ్ నిధులతోనే పరిష్కరిస్తామని అక్కడికక్కడే అధికారులను మంత్రి ఆదేశించారు. నిర్మాణ ప్రాంతంలోని డ్రైనేజీని మెయిన్ ట్రంక్ లైన్‌‌‌‌‌‌‌‌కు అనుసంధానం చేసే బాధ్యతను హౌసింగ్ శాఖ తీసుకుంటుందని తెలిపారు. అనంతరం మంత్రి డ్రా తీసి మాదేసు ల‌‌‌‌‌‌‌‌త అనే మ‌‌‌‌‌‌‌‌హిళ‌‌‌‌‌‌‌‌కు ఇందిర‌‌‌‌‌‌‌‌మ్మ ఎ ట‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌ర్ లోని 801 ఇంటిని కేటాయిస్తూ ప్రక‌‌‌‌‌‌‌‌ట‌‌‌‌‌‌‌‌న చేశారు.  

ఇల్లు వస్తదని అస్సలు ఊహించలేదు: సునీత, లబ్ధిదారు

43 ఏండ్ల నుంచి అద్దె ఇంట్లో ఉంటున్నాను. ఇప్పుడు సొంత ఇల్లు వచ్చింది. ప్రస్తుతం నివాసం ఉంటున్న సమీపంలోనే నాకు ఇల్లు దక్కింది. ఇల్లు వస్తుదని అస్సలు ఉహించలేదు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సందర్భంగా సునీత ఏడుస్తూ.. ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్, మంత్రి పొంగులేటి కాళ్లకు నమస్కరించారు.