అబిడ్స్: కొడుకు గెంటేశాడని వృద్ధ దంపతులు HRCకి ఫిర్యాదు

అబిడ్స్: కొడుకు గెంటేశాడని వృద్ధ దంపతులు HRCకి ఫిర్యాదు

అబిడ్స్, వెలుగు: తమను ఇంటి నుంచి గెంటేసి రోడ్డుపాలు చేశాడని వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కుమారుడి నుంచి ప్రాణహాని ఉందంటూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌‌‌‌‌‌‌‌ను ఆశ్రయించారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లా జమ్మికుంట మండలం వావిలాల గ్రామానికి చెందిన దేవలపల్లి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌(70), జయలక్ష్మి(65) దంపతులు మంగళవారం కమిషన్‌‌‌‌‌‌‌‌ను ఆశ్రయించి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ కొడుకు దేవలపల్లి రవికుమార్‌‌‌‌‌‌‌‌ వృత్తిరీత్యా ఏరోనాటికల్‌‌‌‌‌‌‌‌ ఇంజనీర్‌‌‌‌‌‌‌‌గా పని చేస్తూ, నెలకు రూ.8 లక్షల వరకు సంపాదిస్తున్నాడని తెలిపారు. 

ఖాదీ పరిశ్రమలో చిరుద్యోగిగా పని చేసిన తాను రిటైర్మెంట్​ అనంతరం వచ్చిన డబ్బులతో కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో ఓ ఇంటిని కొనుగోలు చేశానని, ఆ ఇంటిని కొడుకు పేరిట గిఫ్ట్‌‌‌‌‌‌‌‌ డీడ్‌‌‌‌‌‌‌‌ చేశామని చెప్పారు. కొంతకాలం తర్వాత కొడుకు, కోడలు తమను ఇంటి నుంచి బయటకు పంపించారని వాపోయారు. ప్రస్తుతం ఆ ఇంటిని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. పోలీసులను ఆశ్రయించినా తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తాము ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నామని వాపోయారు. కొడుకు, కోడలు తమపై దాడికి పాల్పడ్డారని, తమకు వారి నుంచి రక్షణ కల్పించాలని వేడుకున్నారు.