డేటింగ్ యాప్‌‌‌‌లో పరిచయం తెచ్చిన తంటా.. యువతిని నమ్మి పబ్కు వెళ్తే.. రూ.29వేల884 బిల్లు

డేటింగ్ యాప్‌‌‌‌లో పరిచయం తెచ్చిన తంటా.. యువతిని నమ్మి పబ్కు వెళ్తే.. రూ.29వేల884 బిల్లు
  •      డేటింగ్ యాప్‌‌‌‌లో పరిచయం తెచ్చిన తంటా
  •     బాధితుడి ఫిర్యాదుతో కేసు

జూబ్లీహిల్స్, వెలుగు: డేటింగ్ యాప్‌‌‌‌లో పరిచయమైన యువతిని నమ్మి పబ్‌‌‌‌కు వెళ్లిన ఓ సాఫ్ట్‌‌‌‌వేర్ ఇంజినీర్ కు భారీ బిల్లు రావడంతో అవాక్కయ్యాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్‌‌‌‌ పీఎస్​పరిధిలో జరిగింది. కూకట్‌‌‌‌పల్లికి చెందిన సాఫ్ట్‌‌‌‌వేర్ ఇంజినీర్ చెరుకు హేమంత్‌‌‌‌(27)కు క్వాక్ క్వాక్ డేటింగ్ యాప్‌‌‌‌లో దివ్య అనే యువతి పరిచయమైంది. ఈ  నెల 28న ఇద్దరూ కలిసి జూబ్లీహిల్స్‌‌‌‌లోని  36 కెమిస్ట్రీ పబ్ కు వెళ్లారు. 

అక్కడ పలు రకాల ఆర్డర్లు ఇవ్వగా.. రూ.29,884 బిల్లు వచ్చింది. నాన్ -ఆల్కహాలిక్ పానీయాలకు కూడా ప్రీమియం ఆల్కహాల్ ధరతో బిల్లు వేయడంపై హేమంత్ అనుమానం వ్యక్తం చేయగా, పబ్ సిబ్బంది, బౌన్సర్లు అతడిని చుట్టుముట్టారు. ఈ క్రమంలో సదరు యువతి రూ.10 వేలు చెల్లించినట్లు నకిలీ ట్రాన్సాక్షన్ చూపి అక్కడి నుంచి జారుకుంది. మోసపోయానని గ్రహించిన హేమంత్.. తన వద్ద మోసపూరితంగా డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించిన దివ్యతోపాటు పబ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని జూబ్లీహిల్స్ ఠాణాను ఆశ్రయించాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.