ఇంజెక్షన్ వికటించి 9 నెలల బాలుడు మృతి..శాలిబండలోని ఫాతిమా హాస్పిటల్ యాజమాన్యంపై కేసు

ఇంజెక్షన్ వికటించి 9 నెలల  బాలుడు మృతి..శాలిబండలోని ఫాతిమా హాస్పిటల్ యాజమాన్యంపై కేసు

చార్మినార్, వెలుగు: శాలిబండలోని ఫాతిమా హాస్పిటల్​లో ఇంజెక్షన్ వికటించి 9 నెలల బాలుడు మృతిచెందాడు. కాలపత్తర్‌‌‌‌ ప్రాంతానికి చెందిన మహమ్మద్ ఇస్మాయిల్ తన కుమారుడు మహమ్మద్ హమ్జాకు జ్వరం రావడంతో సోమవారం ఉదయం ఫాతిమా దవాఖానకు తీసుకెళ్లాడు. డాక్టర్ల సూచనతో బాలుడిని హాస్పిటల్​లో అడ్మిట్​చేశాడు. 

హై ఫీవర్ ఉన్నందున ఇంజెక్షన్ ఇవ్వొద్దని తండ్రి కోరినప్పటికీ, డాక్టర్ అవేజ్ మిర్జా ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ వెంటనే బాలుడి నోటి నుంచి నురగలు రావడంతో రాత్రి ఐసీయూకి తరలించారు. పరిస్థితి విషమించడంతో నిలోఫర్ దవాఖానకు తీసుకెళ్లాలని సూచించారు. అక్కడికి తరలించగా.. హమ్జా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఫాతిమా హాస్పిటల్​డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు చనిపోయాడని ఇస్మాయిల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఫాతిమా దవాఖాన యాజమాన్యంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేశ్​గౌడ్ పేర్కొన్నారు.