రైలు ఢీకొని 350 గొర్రెలు మృతి..కాపరికి భువన గిరి ఎమ్మెల్యే రూ.లక్ష సాయం

రైలు ఢీకొని 350 గొర్రెలు మృతి..కాపరికి భువన గిరి ఎమ్మెల్యే రూ.లక్ష సాయం

ఘట్‌‌‌‌కేసర్, వెలుగు: మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా ఘట్‌‌‌‌‌‌‌‌కేసర్ మండలం అవుషాపూర్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న రైలు ప్రమాదంలో సుమారు 350 గొర్రెలు మృతిచెందాయి. యాదాద్రి- భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం అలీనగర్‌‌‌‌కు చెందిన కాపరి బాలబోయిన కిష్టయ్య యాదవ్ అవుషాపూర్​సమీపంలోని ఈస్ట్‌‌‌‌సిటీ వెంచర్ లో గొర్రెలను దొడ్డిలో ఉంచగా.. అర్ధరాత్రి కుక్కల దాడికి భయపడి బయటకు పరుగులు తీశాయి. ఈ క్రమంలో అవుషాపూర్ మారుతినగర్ వైపు పరుగెత్తి, రైలు పట్టాలపైకి చేరాయి.

అదే సమయంలో భువనగిరి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న దక్షిణ్ ఎక్స్‌‌‌‌ప్రెస్ వాటిని ఢీకొట్టింది. ప్రమాద ధాటికి జీవాలు అర కిలోమీటరు మేర చెల్లాచెదురుగా పడిపోయి చనిపోయాయి. సుమారు రూ.30 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌‌‌‌ కమార్​రెడ్డి బాధితుడిని పరామర్శించి, తక్షణ సాయంగా రూ.లక్ష అందజేశారు.