చందానగర్, వెలుగు: వాకింగ్ చేస్తున్న ఓ మహిళ మెడలోని గోల్డ్చైన్ను చోరీ చేసిన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. చందానగర్ లోని హుడా కాలనీ కి చెందిన ఉమాదేవి మంగళవారం ఉదయం తాను ఉంటున్న అపార్ట్మెంట్ ముందు రోడ్డుపై వాకింగ్ చేస్తోంది.
అదే సమయంలో వెనక నుంచి బైక్ పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలో ఉన్న 5.5 తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
