గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా నాకు చెప్పండి: ఎమ్మెల్యే సత్యం 

గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా నాకు చెప్పండి: ఎమ్మెల్యే సత్యం 


మల్యాల, వెలుగు: గ్రామాల్లో ఏ సమస్య ఉన్న నా దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని కరీంనగర్​జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. మంగళవారం మల్యాల మండల పరిషత్ సమావేశ మందిరంలో స్పెషల్ ఆఫీసర్, డీఆర్డీవో పీడీ రఘువరన్ అధ్యక్షతన జరిగిన జనరల్ బాడీ సమావేశానికి ఎమ్మెల్యే సత్యం చీఫ్​గెస్ట్​గా హాజరయ్యారు. మండలంలోని గ్రామాల సర్పంచులు, సింగిల్ విండో అధ్యక్షులు పాల్గొన్న సమావేశంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు తమ నివేదికలను చదివి వినిపించారు. ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

అనంతరం ప్రజాప్రతినిధులు తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. ఆయా సమస్యల పరిష్కారానికి అధికారులు తగిన చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పన కోసం ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.