ఆసియా క్రీడలు 2026లో భారత కాంపౌండ్ మహిళల ఆర్చరీ జట్టు స్వర్ణం సాధించింది. జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళల ఆర్చరీ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఫైనల్ మ్యాచ్‌లో చైనా జట్టును 238--234 తేడాతో ఓడించి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. అంతేకాకుండా 2014లో దక్షిణ కొరియా సృష్టించిన ప్రపంచ రికార్డును ఈ భారత జట్టు సమం చేసింది.
మరోవైపు మహిళల టీమ్ స్క్వాష్‌లో, తన్వి ఖన్నా , అనాహత్ సింగ్ సెమీఫైనల్స్‌కు అర్హత సాధించి భారత్‌కు మరో పతకాన్ని ఖాయం చేశారు. పతకాల పట్టికలో భారత్ టాప్ 10లోకి దూసుకెళ్లింది. అథ్లెటిక్స్ ముగియడంతో, ఈరోజు జట్టును ముందుకు నడిపించే బాధ్యత రెజ్లర్లు, బాక్సర్లు, ఆర్చర్లపై పడింది. కీలో ఫైనల్‌లో స్థానం సంపాదించే ప్రయత్నంలో భారత మహిళల జట్టు దక్షిణ కొరియాతో తలపడుతోంది. స్టార్ జూడో క్రీడాకారిణి అస్మిత దేవ్ కూడా బరిలోకి దిగుతోంది.
India wins Gold in Compound Women’s Team Archery !!
— Kiren Rijiju (@KirenRijiju) September 30, 2026
Congratulations to Jyothi Surekha Vennam, Prithika Pradeep and Taniparthi Chikitha for shooting the arrows perfectly to win Gold medal at #AsianGames2026 #Cheer4Bharat pic.twitter.com/xabp6oOziS
