లగ్జరీ కార్లే అతని టార్గెట్.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ దొంగ

లగ్జరీ కార్లే అతని టార్గెట్.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ దొంగ

వ్యాలెట్ పార్కింగ్ సిబ్బందిగా నటిస్తూ.. రెండు లగ్జరీ కార్లను దొంగిలించిన 29 ఏళ్ల వెబ్‌సైట్ డెవలపర్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. 2023 జూన్ 24న సంగీత కచేరీకి హాజరయ్యేందుకు వెళ్లిన ఓ మహిళకు సంబంధించిన లగ్జరీ కారును బి అరుణ్‌రెడ్డి దొంగిలించాడు. అరుణ్‌ రెడ్డి వ్యాలెట్ అని చెప్పుకుని.. మహిళ వద్దకు వెళ్లాడని పోలీసులు తెలిపారు. తన ఫోన్‌ లోని యాప్‌ లో ఆమె వివరాలను నమోదు చేశాడని... ఆమె కారు తాళాన్ని అరుణ్ రెడ్డికి ఇచ్చిన తర్వాత అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడని పేర్కొన్నారు. అనంతరం దొంగిలించిన వాహనాన్ని ఓ హోటల్‌లో పార్క్ చేశాడు.  2023 జూన్ 30 శుక్రవారం దానిని తీసుకెళ్లేందుకు వెళ్లిన అరుణ్ రెడ్డిని రెడ్డ్ హ్యాండెడ్ గా అరెస్ట్ చేశామని పోలీసుల బృందం తెలిపింది. 

నిందితుడు రద్దీగా ఉంటే పార్కింగ్ ప్రాంతాల్లో ఖరీదైన కార్లలో వచ్చిన వారిని టార్గెట్‌గా చేసుకుని వాలెట్ పారింగ్ పేరుతో కారు యజమానుల వద్ద నుంచి కీస్ తీసుకుని లగ్జరీ కార్లను చోరీకి పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు. గతేడాది మే నెలలో బి అరుణ్‌రెడ్డి ఓ పబ్‌లో మరో లగ్జరీ కారును దొంగిలించినట్లు తేలిందని చెప్పారు. ఆ కారును అతని ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నామని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.