- కేంద్ర, రాష్ట్ర కార్మిక శాఖల మంత్రులను ఆహ్వానించాం
పంజాగుట్ట, వెలుగు: కార్మికుల ఉపాధి, సంక్షేమం కోసం హైదరాబాద్‌లోని మారియట్హోటల్లో ఈ నెల 15,16న బ్రిక్స్ట్రేడ్యూనియన్స్సమ్మిట్–2026 నిర్వహిస్తున్నట్లు బ్రిక్స్ట్రేడ్యూనియన్స్ఫోరమ్చైర్మన్సుంకరి మల్లేశం తెలిపారు. సోమవారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమ్మిట్‌కు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్మాండవీయ, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించామన్నారు.
బ్రెజిల్, చైనా, ఈజిప్టు, ఇథియోపియా, ఇండియా, ఇరాన్, అరబ్దేశాలలో కార్మికులకు ఉన్న ఉపాధి అవకాశాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. 12 దేశాల నుంచి 170 మంది ప్రతినిధులు హాజరుకానున్నట్లు తెలిపారు. సమావేశంలో నాయకులు కలాల్ శ్రీనివాస్, రమేశ్‌గౌడ్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
