2 బైకులు 2 నెలలు : బాబోయ్ ఎన్ని చలానాలో

2 బైకులు 2 నెలలు : బాబోయ్ ఎన్ని చలానాలో

హైదరాబాద్ : వాహనాల తనిఖీలో ట్రాఫిక్ పోలీసులకు ఇద్దరు బైకర్లు షాక్ ఇచ్చారు. తనిఖీలో భాగంగా ఫాస్ట్ గా వచ్చిన TS 09 EW 6053 నంబరు బైక్ ను ఆపి, పోలీస్ యాప్ తో బండి నంబర్ చెక్ చేయగా 30 చలానాలు పెండింగ్ లో ఉన్నట్లు తెలిసింది.  సిగ్నల్ జంపింగ్, రాంగ్ రూట్స్, నో హెల్మెట్, ట్రిపుల్ డ్రైవింగ్ లాంటివాటితో రూ.8వేల380 అమౌంట్ పెండింగ్ లో ఉంది.

TS 12 EE 1960 నెంబర్ గల మరో బైక్ ఆపగా దానికి కూడా 30 పెండింగ్‌ చలానాలతో, రూ. 5వేల 465 జరిమానా ఉంది. ఆ వాహనాలను ట్రాఫిక్‌ పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్ కు తరలించారు. ఫైన్ చెల్లిస్తేనే బైకులను అప్పగిస్తామని తెలిపారు పోలీసులు. సోమవారం సాయంత్రం నారాయణగూడలోని లింగంపల్లి పోలీసు క్వార్టర్స్‌ దగ్గర వాహనాల తనిఖీలు చేపట్టగా .. 2 బైకులకు రెండు నెలల్లోనే పెండింగ్ లో ఇంతపెద్ద జరిమానాలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు ట్రాఫిక్ పోలీసులు.