- గ్రేటర్లో ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు
- మెట్రో స్టేషన్లు, బస్టాండ్లను కలిపేలా సైకిల్ ట్రాక్‌లు, వాక్‌వేలు
- మొదటిదశలో ఎల్బీనగర్, ఎస్సార్‌నగర్‌లో అమలు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: గ్రేటర్‌పరిధిలో పబ్లిక్ట్రాన్స్పోర్టేషన్ను ప్రోత్సహించి ట్రాఫిక్ కష్టాలను తగ్గించడానికి హెచ్ఎండీఏ అనుబంధ సంస్థ ఉమ్టా నేతృత్వంలో ట్రాన్సిట్ఓరియెంటెడ్డెవలప్మెంట్(టీవోడీ) ప్రాజెక్టులను అమలు చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా మెట్రోరైల్, బస్సుల్లో ప్రయాణికులు ఎలాంటి ట్రాఫిక్ఇబ్బందుల్లేకుండా నేరుగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లోని కాలనీలు, బస్తీలను మెయిన్‌రోడ్‌కు కనెక్ట్చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.
ఇలా అభివృద్ధి చేసిన ప్రాంతాల్లో వాక్‌వేలు, సైకిల్‌ట్రాక్‌లు, లింక్‌రోడ్లు నిర్మించనున్నారు. ప్రస్తుతం సిటీలోని మూడు మెట్రో కారిడార్లతో పాటు మెట్రోరెండో దశలో నిర్మించనున్న ఐదు కారిడార్లను కలిపి 8 మార్గాల్లో ఈ టీవోడీ ప్రాజెక్టును చేపట్టనున్నారు. దీనివల్ల ఎవరైనా ఇండ్ల నుంచి నేరుగా సైకిల్స్లేదా బ్యాటరీతో నడిచే వాహనాల్లో లేదా నడుస్తూ మెయిన్‌రోడ్‌కు చేరుకుని బస్టాండ్లేదా మెట్రోలో ప్రయాణించొచ్చు. ట్రాఫిక్ఎక్కువగా ఉన్న ఎంపిక చేసిన ప్రాంతాల్లో వీటిని నిర్మించడం వల్ల చాలా వరకు ప్రైవేట్ వాహనాలు, సొంత వాహనాల వినియోగం తగ్గుతుందని భావిస్తున్నారు.
తొమ్మిది కారిడార్లు
పబ్లిక్ట్రాన్స్పోర్టేషన్మరింత మెరుగు పరిచేందుకు చేపడుతున్న ఈ టీఓడి ప్రాజెక్టులో మొత్తం 9 కారిడార్లను నిర్మించనున్నారు. ముందుగా చేపట్టే ఎల్బీనగర్, ఎస్ఆర్నగర్తో పాటు నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–చాంద్రాయణగుట్ట, ఎల్బీనగర్–శంషాబాద్ఎయిర్పోర్ట్, మియాపూర్–బీహెచ్ఈఎల్, రాయదుర్గం– మియాపూర్, రాయదుర్గం – అమెరికన్కాన్సులేట్, ఎల్బీనగర్– హయత్‌నగర్, శంషాబాద్ఎయిర్పోర్ట్ – ఫ్యూచర్‌సిటీ కారిడార్లలోని ప్రాంతాలను టీవోడీ కింద అభివృద్ధి చేయనున్నారు. నిధులను కేంద్ర ప్రభుత్వంలోని స్పెషల్అసిస్టెన్స్స్టేట్క్యాపిటల్ఇన్వెస్ట్మెంట్(సాస్కి) పథకం ద్వారా సేకరించాలని నిర్ణయించారు.
మొదటి దశలో ఎల్బీనగర్, ఎస్ఆర్నగర్
ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి దశల్లో ఎల్బీనగర్, ఎస్ఆర్నగర్ప్రాంతాలను ఎంపిక చేశారు. ఈ ప్రాంతాల్లో 500 మీటర్ల పరిధిలో వాక్‌వేలు, సైక్లింగ్ట్రాక్స్, నాన్ మోటరైజ్డ్వాహనాల వినియోగానికి స్పెషల్ ట్రాక్‌లు నిర్మించనున్నారు. ఎవరైనా చాలా సులభంగా మెట్రో స్టేషన్నుంచి ఇండ్లకు చేరుకునేలా లాస్ట్మైల్కనెక్టివిటీని ప్రోత్సహించనున్నారు. సైకిళ్లు, బ్యాటరీతో నడిచే వాహనాలను ఎక్కువగా ఉపయోగించేలా ప్రత్యేక కారిడార్‌ను నిర్మిస్తారు. అవసరమైన ప్రాంతాల్లో చౌరస్తాలను విస్తరిస్తారు. స్కూల్ఆఫ్ప్లానింగ్అండ్ఆర్కిటెక్చర్ఆధ్వర్యంలో ప్లాన్లు రూపొందిస్తున్నారు.

