క్రిస్మస్తో పాటు వీకెండ్.. వరుస సెలవులతో నగరవాసులు ఊర్లకు బయలుదేరడంతో విజయవాడ నేషనల్హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ఏర్పడింది. హయత్ నగర్ నుంచి ఓఆర్ఆర్ వరకు, ఓఆర్ఆర్ నుంచి చౌటుప్పల్ వరకు వాహనాలు నెమ్మదిగా కదిలాయి. రోడ్డు విస్తరణతో కొన్ని చోట్ల వాహనదారుల ఇబ్బందులు పడ్డారు. ఫ్లై ఓవర్ పనులు నెమ్మదిగా సాగుతుండడంతో వీకెండ్స్, పండుగలు సమయంలో వాహనదారులు నరకం చూస్తున్నారు.
