హైదరాబాద్లో తాగునీటితో బండ్లు కడుగుతున్నారా..? మీరు కూడా ఇలాంటి కేసు ఎదుర్కుంటారు జాగ్రత్త !

హైదరాబాద్లో తాగునీటితో బండ్లు కడుగుతున్నారా..? మీరు కూడా ఇలాంటి కేసు ఎదుర్కుంటారు జాగ్రత్త !

హైదరాబాద్ లో ఉన్న అత్యధిక జనాభాకు తాగు నీటి సౌకర్యం కల్పిండం సవాళ్లతో కూడుకున్నది. వర్షా కాలంలో సిటీ చుట్టుపక్కల ఉన్న రిజర్వాయర్లు, మంజీరా, కృష్ణా, గోదావరి జలాలతో నగర ప్రజల దాహార్తి తీరుస్తుంటారు. కానీ ఎండా కాలం వచ్చే వరకు కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్యలు తలెత్తడం చూస్తూనే ఉంటాం. అలా నీటి సమస్యలు రాకుండా.. తాగునీరు వృధా కాకుండా ముందస్తుగానే చర్యలు ప్రారంభించారు జలమండలి అధికారులు. 

హైదరాబాద్ లో తాగునీటిని వృధా చేస్తున్న వ్యక్తిపై జలమండలి అధికారులు జరిమానా విధించడం చర్చనీయాంశంగా మారింది. బంజారాహిల్స్ కు చెందిన నారాయణ అనే వ్యక్తికి 10 వేల రూపాయల జరిమానా విధించింది జలమండలి. 

తాగునీటితో వాహనాలు శుభ్రం చేయడం, తరచూ వృథా చేయడాన్ని జలమండలి అధికారులు గుర్తించారు. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు సదరు వ్యక్తికి 10 వేల జరిమానా విధించారు  అధికారులు. తాగునీటిని వృధా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.