హైదరాబాద్సిటీ, వెలుగు: రోబోటిక్ టెక్నాలజీతో మానవ రహిత పారిశుధ్య పనులను చేపట్టిన వాటర్బోర్డు కొత్తగా ఏఐ టెక్నాలజీని వాడి డీ సిల్టింగ్ పనులను నిర్వహించడానికి సిద్ధమైంది. ఈ మేరకు కొత్త టెక్నాలజీ ఎలా పని చేస్తుందో తెలుసుకోవడానికి బోర్డు ఎండీ అశోక్ రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్ ఓఅండ్ఎం డివిజన్--2 పరిధిలో ఫీల్డ్విజిట్చేశారు.
శాటిలైట్ ఆధారంగా, జీఐఎస్ పరిజ్ఞానంతో ఈ వ్యవస్థ పని చేస్తుంది. మ్యాన్హోళ్లతో పాటు అడ్డంగా ఉన్న పైప్లైన్లను శుభ్రం చేసే సెల్ఫ్ డిటెక్టివ్ రోబోటిక్ వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. మ్యాన్ హోల్లో అడ్డంకులు ఏర్పడే ముందే అంచనా వేసి నివారించే ఏఐ ఆధారిత ప్రిడిక్షన్ అండ్ ప్రివెంటివ్ వ్యవస్థ ఉంది.
