హైదరాబాద్లో ఈ ఏరియాల్లో వర్షం.. చిరు జల్లులతో కూల్ కూల్గా మారిన వెదర్

హైదరాబాద్లో ఈ ఏరియాల్లో వర్షం.. చిరు జల్లులతో కూల్ కూల్గా మారిన వెదర్

ఓ రోజు ఓ రోజు వాన అన్నట్లు మారుతోంది హైదరాబాద్ వెదర్. శనివారం (జూన్ 20) సాయంత్రం వరకు ఎండ భగభగలతో మండిన సిటీని సాయంత్రం వర్షం కాస్త చల్లబర్చింది. అదే విధంగా ఆదివారం (జూన్ 21) తెల్లవారుజాము నుంచే కురుస్తున్న చిరుజల్లుతో సిటీ వెదర్ కూల్ కూల్ గా మారిపోయింది. 

ఉదయం బోడుప్పల్, పీర్జాదిగూడ, మేడిపల్లి ప్రాంతాలలో ముసురు కురిసింది. ఉప్పల్ నుంచి నారాపల్ల వరకు చిరుజల్లులు కురుస్తున్నాయి.

మరోవైపు జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మాసబ్ ట్యాంక్ , కోఠి ,మలక్ పేట్ , దిల్ సుఖ్ నగర్ తదితర ప్రాంతాల్లో ఉదయం నుంచి తేలపాటి జల్లులు కురుస్తున్నాయి. 

సిటీలో కురుస్తున్న జల్లులతో వాతావరణం చల్లబడింది. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచించింది. మరోవైపు వర్షాల కారణంగా ప్రజలకు ఎలంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక రాష్ట్రంలో రెండు వారాల పాటు సాధారణం కన్నా తక్కువ వర్షాలే పడతాయని ఐఎండీ పేర్కొంది. ఈ వారం దాటితే మాన్సూన్ విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి రుతుపవనాలు బలహీనంగా ఉన్నా.. తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో చెప్పుకోదగిన స్థాయిలో వర్షాలుంటాయని పేర్కొంది.