- మంగళవారం ( మే 26)42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు
- నగరవాసులకు ఉపశమనం
- మే 28న మళ్లీ భారీ వర్షం..ఎల్లో అలర్జ్జారీ
హైదరాబాద్ సిటీ, వెలుగు:నగరంలో మంగళవారం రాత్రి కురిసిన చిరుజల్లులు బుధవారం నగరవాసులకు ఉపశమనాన్ని కలిగించాయి. ఆకాశం పూర్తిగా మేఘామృతమై వాతావరణం చల్లబడడంతో సిటీ జనం మండుతున్న ఎండలు, ఉక్కపోత నుంచి రిలాక్స్ఫీలయ్యారు. కొద్దిరోజులుగా నగరంలో 40 డిగ్రీలకుపైగానే టెంపరేచర్లు నమోదవుతున్నాయి. దీంతో ఉదయం 10 గంటలు దాటిన తర్వాత సాయంత్రం 5 గంటల్లోపు ఎక్కువగా రోడ్ల మీదకు రావడం లేదు. కానీ, మంగళవారం రాత్రి 11 గంటల నుంచి తెల్లవారే దాకా చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. మల్కాజిగిరిలో 2.08 సెంటీమీటర్లు, ఆర్సీపురంలో1.63, షాపూర్ నగర్ లో 1.60, జీడిమెట్ల లో 1.45, కూకట్ పల్లిలో 1.30, మియాపూర్ లో 1.20 సెంటీమీటర్లు పడినా..ఉరుములు, మెరుపులతో కొన్ని గంటల పాటు కురవడంతో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఈ ఎఫెక్ట్‌తో బుధవారం వివిధ ప్రాంతాల్లో 32 డిగ్రీల నుంచి 34 డిగ్రీల వరకు టెంపరేచర్ నమోదైంది. మంగళవారంతో పోల్చుకుంటే ఏకంగా 10 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యాయి.
నేడూ వాన..
నగరంలో గురువారం భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గురువారం ఎల్లో అలెర్ట్ (6.45 సెంటిమీటర్ల నుంచి 11.55 సెంటిమీటర్లు కురిసే ఛాన్స్ )జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వెల్లడించింది. వర్షం పడే టైంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
వాటర్ స్టేషన్లకు గాలివాన ఎఫెక్ట్
భారీగా ఈదురు గాలులు, వర్షం, చెట్లు కూలడంతో విద్యుత్‌సరఫరాలో అంతరాయం తలెత్తి మంజీరా తాగునీటి పంపింగ్ లో బుధవారం ఇబ్బందులు కలిగాయని వాటర్ బోర్డు తెలిపింది. దీంతో కలబ్ గుర్, రాజంపేట, పటాన్ చెరు పంపింగ్ స్టేషన్లలో పంపింగ్ నిలిపివేసినట్టు తెలిపారు. ఫాల్ట్ లొకేషన్లు గుర్తించి రిపేర్లు విద్యుత్‌శాఖ రిపేర్లు చేయడంతో పంపులను ప్రారంభించినట్టు ప్రకటించింది. ఈ కారణంగా పలు ప్రాంతాల్లో తాత్కాలికంగా నీటి సరఫరాలో అంతరాయం కలిగిందని పేర్కొంది.
