రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగింది. సోమవారం 20 జిల్లాల్లో టెంపరేచర్లు సింగిల్ డిజిట్‌కు పడిపోగా, మంగళవారం రాత్రి ఆ సంఖ్య 25 జిల్లాలకు పెరిగింది. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 5.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కుమ్రంభీం జిల్లా సిర్పూర్లో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది.
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగింది. సోమవారం 20 జిల్లాల్లో టెంపరేచర్లు సింగిల్ డిజిట్‌కు పడిపోగా, మంగళవారం రాత్రి ఆ సంఖ్య 25 జిల్లాలకు పెరిగింది. అత్యల్ప ఉష్ణోగ్రతలు కూడా మరింత తగ్గాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 5.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. కుమ్రంభీం జిల్లా సిర్పూర్లో 6 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా అర్లిటిలో 6.2, రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 6.6, వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో 6.9 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయి.
సిద్దిపేట జిల్లాలో 7.4, మెదక్, నిజామాబాద్, కామారెడ్డిలో 7.8 డిగ్రీలు, నారాయణపేట 8.2, నిర్మల్ 8.6, సిరిసిల్లలో 8.7, పెద్దపల్లి, ములుగు, జగిత్యాలలో 8.9, యాదాద్రి భువనగిరిలో 9, భూపాలపల్లి, నాగర్‌కర్నూల్ లో 9.2, కరీంనగర్, మహబూబ్‌నగర్‌లో 9.3, మంచిర్యాల, మేడ్చల్‌లో 9.4, భద్రాద్రి కొత్తగూడెం 9.5, మహబూబాబాద్‌లో 9.8, నల్గొండ జిల్లాలో 10 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మిగతా 8 జిల్లాల్లో 10.2 డిగ్రీల నుంచి 12.4 డిగ్రీల మధ్యలో టెంపరేచర్లు నమోదయ్యాయి. హైదరాబాద్ సిటీలోనూ హెచ్‌సీయూ వద్ద 8.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. రాజేంద్రనగర్‌లో 9.2, మౌలాలిలో 9.4 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. బీహెచ్ఈఎల్ వద్ద 10.5, శివరాంపల్లిలో 10.8 మేర కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

