V6 News

వరల్డ్ మాస్టర్స్ స్పోర్ట్స్ ఛాంపియన్ షిప్ లో సునందకు 3 బంగారు పతకాలు

వరల్డ్ మాస్టర్స్ స్పోర్ట్స్ ఛాంపియన్ షిప్ లో సునందకు 3 బంగారు పతకాలు

హైదరాబాద్ సిటీ మెహదీపట్నంకు చెందిన చింత సునంద భారతి.. థాయిలాండ్ దేశంలో జరిగిన వరల్డ్ మాస్టర్స్ స్పోర్ట్స్ ఛాంపియన్ షిప్ పోటీల్లో సత్తా చాటారు. 2026, ఏప్రిల్ 17 నుంచి 20వ తేదీ వరకు జరిగిన ఈ అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొన్న సునంద భారతి.. మూడు విభాగాల్లో పాల్గొన్నారు. ఈ మూడు విభాగాల్లో మొదటి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్స్ సాధించటం దేశానికే గర్వకారణం. 

>>> 200 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్
>>> 400 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం
>>>  షాట్ పుట్ పోటీలో గోల్డ్ మెడల్

భారతదేశం నుంచి అథ్లెటిక్స్ లో మూడు విభాగాల్లోనూ అద్భుతమైన ప్రతిభ కనపరిచి బంగారు పతకాలు సాధించటంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఎవరీ సునంద భారతి :

థాయిలాండ్ దేశంలో జరిగిన వరల్డ్ మాస్టర్స్ స్పోర్ట్స్ ఛాంపియన్ షిప్ మూడు గోల్డ్ మెడల్స్ సాధించిన చింత సునంద భారతి.. ఓ గృహిణి. హైదరాబాద్ సిటీ మెహదీపట్నం నివాసి. క్రీడలపై ఉన్న ఉత్సాహంతో.. భర్త ప్రోత్సాహంతో అథ్లెటిక్స్ రంగంలో రాణిస్తున్నారు. ఇప్పుడే కాదు.. గతంలోనూ సునంద భారతి భారతదేశం తరపున తన సత్తా చాటారు. 2026, జనవరి నెలలో హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని.. మూడు గోల్డ్ మెడల్స్ సాధించి.. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. అందులో భాగంగానే ఏప్రిల్ నెలలో థాయిలాండ్ దేశంలో జరిగిన వరల్డ్ మాస్టర్స్ స్పోర్ట్స్ ఛాంపియన్ షిప్ పోటీల్లో.. భారతదేశం తరపున పాల్గొని.. 200, 400 మీటర్ల పరుగు పందెంలో.. షాట్ పుట్ విభాగాల్లో మొదటి స్థానంలో నిలిచి మూడు గోల్డ్ మెడల్స్ సాధించారు సునంద భారతి.