హైదరాబాద్ సిటీ, వెలుగు: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆదిత్య బిల్డర్స్ కు నిర్మాణ అనుమతులు వచ్చాయని హైడ్రా పేర్కొంది. మూసీలోకి రిటైనింగ్ వాల్ నిర్మించడంతో ఆ అనుమతులను హైకోర్టు రద్దు చేసిందని తెలిపింది. దీంతో ఆదిత్య బిల్డర్స్ హైకోర్టును ఆశ్రయించగా.. రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని పరిశీలించాలంటూ ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను కోర్టు ఆదేశించిందని.. ఆ తర్వాత మూసీలో కట్టిన రిటైనింగ్ వాల్ ను ఆదిత్య బిల్డర్స్ తొలగించిందన్నారు.
తర్వాత వెనక్కి జరిపి కడతామని కోర్టుకు నివేదించిందన్నారు. ఇరిగేషన్, రెవెన్యూ నివేదికతో పాటు ఆదిత్య బిల్డర్స్ హామీతో మళ్లీ నిర్మాణ అనుమతులను హైకోర్టు పునరుద్ధరించిందని తెలిపింది. ప్రస్తుతం హైకోర్టు అనుమతులతోనే నిర్మాణాలు జరుగుతున్నాయని, ఈ పరిణామాలన్నీ హైడ్రా రాక ముందు జరిగినవేనని.. ఈ విషయాన్ని జాగృతి అధ్యక్షురాలు కవిత, ఇతర ఆందోళనకారులు తెలుసుకోవాలని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది.
