
వివాదాస్పద భూమిలో మారణాయుధాలను చూసి అవాక్కయ్యారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. బుధవారం (మే 14) రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడలో పర్యటించిన ఆయన.. భూమి విషయంలో మారణాయుధాలతో దాడి చేసిన ఘటన గురించి తెలుసుకున్నారు.
ప్లాటు యజమానులపై మారణాయుధాలతో దాడి చేస్తే, మర్డర్ కేసు పెట్టకపోవడంపై హయత్నగర్ సీఐ నాగరాజు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు కొనుగోలు చేసిన స్థలాన్ని ఎవరైనా కబ్జా చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది సీఐని ప్రశ్నించారు. బాధితుల పట్ల ఇలాంటి పరిణామాలు జరుగుతున్న క్రమంలోనే హైడ్రా పోలీసు స్టేషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
కోహెడ గ్రామ రెవిన్యూ పరిధిలోని సర్వే నంబర్ 951,952లో ప్లాట్స్ ఓనర్స్, ఆ భూమి కొనుగోలు చేసిన సంరెడ్డి బాల్ రెడ్డి అనే వ్యక్తి మధ్య కొన్నాళ్లుగా వివాదం కొనసాగుతోంది. ఇక్కడ వెంచర్ కు సంబంధించిన రోడ్డును కబ్జా చేసి ఫార్మ్ హౌజ్ నిర్మిస్తున్నారని గత ఫిబ్రవరిలో వచ్చిన ఫిర్యాదుతో ఫార్మ్ హౌజ్ ను హైడ్రా కూల్చివేసింది. కూల్చివేతలతో హై కోర్ట్ నుండి నాట్ టు ఇంటర్ఫియర్ తో పాటు ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు ఫార్మ్ హౌజ్ ఓనర్ బాల్ రెడ్డి.
గత రెండు నెలల క్రితం మార్చి 28న ప్లాట్స్ ఓనర్స్ కు అనుకూలంగా రంగారెడ్డి జిల్లా కోర్టు డిక్రీ ఇచ్చింది. ఈ నెల 1న ప్లాట్స్ క్లీన్ చేసుకుంటున్న సమయంలో బాల్ రెడ్డి వర్గీయులు ప్లాట్స్ ఓనర్స్ మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో ప్లాట్స్ ఓనర్స్ పై కొడ్డలి, కత్తులతో దాడికి దిగారు బాల్ రెడ్డితో పాటతు ఆయన అనుచరులు.
ఈ ఘటనపై హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బాధితులు. హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేస్తే.. సాధారణ గొడవ కింద ఇరు వర్గాలపై కేసు నమోదు చేశారు హయత్ నగర్ పోలీసులు.
ఆ గొడవ గురించి పూర్తిగా తెలుసుకున్న కమిషనర్ రంగనాథ్.. కత్తులు, గొడ్డలి ఉపయోగించినా కూడా హత్య బాల్ రెడ్డిపై హత్య హత్యం కేసు ఎందుకు నమోదు చేయలేదని సీఐపై ఫైర్ అయ్యారు. బాధితులకు న్యాయం చేసే విధంగా హైడ్రా పనిచేస్తుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.