హైదరాబాద్ రాజేంద్రనగర్లో హైడ్రా కూల్చివేతలు.. జేసీబీకి అడ్డంగా పడుకున్న మహిళలు !

హైదరాబాద్ రాజేంద్రనగర్లో హైడ్రా కూల్చివేతలు.. జేసీబీకి అడ్డంగా పడుకున్న మహిళలు !

హైదరాబాద్ రాజేంద్రనగర్ లో హైడ్రా కొరడా ఝుళిపించింది. మంగళవారం (జులై 08) పార్కు స్థలం కబ్జాలను కూల్చివేశారు అధికారులు. పార్క్ స్థలం కబ్జా చేశారంటూ నలందా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ హైడ్రాకు  ఫిర్యాదు చేసింది. స్థానికుల ఫిర్యాదుతో ఉదయం నలందానగర్ కు చేరుకున్న హైడ్రా.. కబ్జాకు గురైన స్థలాన్ని కూల్చివేసింది.

కబ్జాల కూల్చివేతకు ముందు అక్కడ కొంత హైడ్రామా నడిచింది. తమ పట్టా భూముల్లో నిర్మాణం చేసుకున్నామని, కూల్చివేతలు చేపట్టవద్దని పట్టాదారులు వాదనకు దిగారు.  ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడం సరికాదని పట్టాదారుల ఆవేదన వ్యక్తం చేశారు. జేసీబీ వాహనాలకు అడ్డంగా పడుకుని ఆందోళనకు దిగారు. మహిళలుహైడ్రా అధికారులతో వాగ్వాదానికి దిగటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

హైదర్ గూడ విలేజ్ సర్వే నంబరు 16 లో 1000 గజాల పార్కు స్థలం కబ్జా చేసి ప్రహరీ నిర్మించారనని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. భారీగా పోలీసు బందోబస్తు నడుమ ప్రహరీ గోడలు కూల్చివేశారు. కబ్జాలు ఎక్కడఉన్నా.. వాటి వెనుక ఎంతటి నాయకులు ఉన్నా సహించేదిలేదని.. కబ్జాలను కూల్చివేస్తామని హైడ్రా అధికారులు తెలిపారు.